ఏపీలో వాహనమిత్ర పథకం అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను ap-vahanamitra విడుదల చేసింది. ఈనెల 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించబడతాయి.
వాహనమిత్ర పథకం – కొత్త మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి వాహనమిత్ర పథకం అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రారంభమవుతుంది.
అర్హత నిబంధనలు
- దరఖాస్తుదారుని పేరు మీద వాహనం ఏపీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయి ఉండాలి. (ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనం నడపడానికి).
- మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి.
- ఆటో రిక్షాల విషయంలో 2025-26 సంవత్సరానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా అనుమతిస్తారు. కానీ ఒక నెలలోపు పొందాలి.
- దరఖాస్తుదారు బీపీఎల్ / రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ అయితే అర్హత ఉండదు. (పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు).
- ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి (గత 12 నెలల సగటు ఆధారంగా).
- వాహనంపై పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.
- వ్యవసాయ భూమి మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస/వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.
- గత సంవత్సరం (2023-24)లో పథకం కింద లబ్ధి పొందిన వారి వివరాలు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పరిశీలిస్తారు.
ముఖ్యమైన తేదీలు
- సెప్టెంబర్ 17 గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
- అక్టోబరు 1 వాహనమిత్ర పథకం ap-vahanamitra అమలులోకి.