ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. AP school attendance rules విద్యార్థి హాజరు తగ్గితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, ఎక్కువ రోజులు గైర్హాజరైతే ఇంటికి వెళ్లి పరిశీలించాలన్న సూచనలు.
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల నిర్వహణపై విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థుల హాజరు పై మరింత నియంత్రణ, ఫాలోఅప్ కోసం చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రధాన ఆదేశాలు ఇవే:
విద్యార్థులు 3 రోజులకు మించి స్కూల్‌కి రాకపోతే, తల్లిదండ్రులకు తక్షణమే ఫోన్ చేయాలి.
5 రోజులు హాజరుకాకపోతే, MEO (మండల విద్యా అధికారి) లేదా CRP (క్లస్టర్ రిసోర్స్ పర్సన్) ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి విచారణ చేయాలి.
టీచర్లు సెలవు తీసుకుంటే, వెంటనే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుని నియమించాలి.
హాజరు అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్కూల్ హెడ్ మాస్టర్లకు సూచన.
సమావేశ వివరాలు:
ఈ ఆదేశాలు తాజాగా జరిగిన అకడమిక్ మానిటరింగ్ అధికారులతో సమావేశంలో నిర్ణయించబడ్డాయి. విద్యార్థుల డ్రాప్ అవుట్‌ను తగ్గించేందుకు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత గమనింపు AP school attendance rules అవసరం అని అధికారుల భావన.
లక్ష్యం:
విద్యార్థుల హాజరును పెంచడం
డ్రాప్ అవుట్ రేటు తగ్గించడం
తల్లిదండ్రులకు సహాయక సమాచార వ్యవస్థ అందించడం
స్కూల్ ఫంక్షనింగ్‌పై వేగవంతమైన అడ్మినిస్ట్రేషన్