ap ration card : రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి: ఏప్రిల్ 30 చివరి తేదీ

AP Ration Card eKYC
  • రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి: ఏప్రిల్ 30 చివరి తేదీ
    ప్రభుత్వ ఫలాల కోసం ఈకేవైసీ తప్పనిసరి – తంగిరాల సౌమ్య

రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నింటినీ పొందాలంటే ap ration card రేషన్ కార్డులకు ఈకేవైసీ (eKYC) తప్పనిసరిగా చేయించుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. నందిగామ పట్టణంలోని కాకాని నగర్‌ లోని ఆమె కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఈ నెల 30వ తేదీ చివరి గడువు
రేషన్ కార్డు eKYC ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోపు పూర్తిచేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోయినా, గ్రామ సచివాలయ అధికారుల సహకారంతో మొబైల్ OTP ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని వివరించారు.

సంక్షేమానికి రేషన్ కార్డు eKYC కీలకం
ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళలా చూసుకుంటూ పరిపాలన కొనసాగిస్తోందని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడడం తమ లక్ష్యమని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈకేవైసీ చేయించుకోని వారెవరైనా ఉంటే తక్షణమే ap ration card రేషన్ కార్డుకు KYC చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Comment