ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 2025: రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ నెల (ఏప్రిల్) 30లోగా రేషన్ కార్డుదారులు AP Ration Card eKYC Update 2025 తప్పనిసరిగా eKYC ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. లేకపోతే వారి రేషన్ అందుబాటులో ఉండకపోవచ్చు.
ఎలా తెలుసుకోవాలి మీ eKYC స్టేటస్?
-
పోస్ మెషిన్ ద్వారా రేషన్ డీలర్ లేదా మొబైల్ రేషన్ వాహనాల వద్ద మీ కార్డు స్కాన్ చేయించండి.
-
ఎర్ర రంగు బాక్స్ (Red Box): మీ eKYC పెండింగ్‌లో ఉంది. వెంటనే చేయాలి.
-
ఆకుపచ్చ రంగు బాక్స్ (Green Box): మీరు eKYC ఇప్పటికే పూర్తి చేశారు.
మీ పేరు EPDS సైట్‌లో ఎలా చెక్ చేయాలి?
-
గూగుల్‌లో
epds1
అని టైప్ చేసి సెర్చ్ చేయండి. -
‘Department of Consumer Affairs, Food & Civil Supplies – AP’ అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
-
‘RICE CARD SEARCH‘ లేదా ‘EPDS APPLICATION SEARCH‘ పై క్లిక్ చేసి, మీ రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి.
-
మీ పేరెదురుగా SUCCESS లేదా S అనే ముద్ర ఉంటే – eKYC పూర్తయింది.
ఎవరికి ఈకేవైసీ తప్పనిసరి కాదు?
-
5 ఏళ్లు లోపు చిన్నారులు
-
80 ఏళ్లు పైబడిన వృద్ధులు
డెడ్‌లైన్: ఏప్రిల్ 30, 2025
ఈ తేదీ వరకే అవకాశం ఉంది. తరువాత మీ పేరు రేషన్ పంపిణీ లిస్టులో ఉండకపోవచ్చు. AP Ration Card eKYC Update 2025 కావున వెంటనే మీ రేషన్ డీలర్‌ను సంప్రదించి, వేలిముద్రతో eKYC పూర్తి చేయండి.