government employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

government employees

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును రాష్ట్ర ప్రభుత్వం government employees జూన్ 9 వరకు పొడిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ ఆధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.

మునుపటి షెడ్యూల్ ప్రకారం, మే 15 నుండి జూన్ 2 వరకు బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం మరో వారం రోజులు గడువు పొడిగించాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం వల్ల బదిలీ ప్రక్రియలో ఉన్న ఉద్యోగులకు మరింత సమయం లభించనుంది. గడువు పొడిగింపుతో బదిలీలపై ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ ఆర్థిక government employees శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.

Leave a Comment