covid-19 : ఏపీలో కరోనా వైరస్.. మంత్రి కీలక ప్రకటన

covid-19

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో covid-19 రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పలు సూచనలు చేశారు.

మంత్రి పార్ధసారధి మాట్లాడుతూ, వృద్ధులు, గర్భిణీలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు. అలాగే, విదేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

సామూహిక కార్యక్రమాలు, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి అని పేర్కొన్న ఆయన, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్ట్‌లలో మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

వైద్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మంత్రి పార్ధసారధి వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు కావాల్సిన సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఉన్న అధికార యంత్రాంగం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం covid-19 ద్వారా కోవిడ్‌ను ఎదుర్కోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Comment