Anna Konidela Tirumala visit : కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా కొణిదల

Anna Konidela

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదల Anna Konidela Tirumala visit ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నారు. త‌న కుమారుడు ఆరోగ్యం కోసం ఆమె తిరుమ‌లకు వ‌చ్చారు.

అగ్ని ప్రమాదం నుంచి కుమారుడు బయటపడిన నేపథ్యంలో మొక్కు

సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ప్రాణాలతో బయటపడటాన్ని దైవకృపగా భావించిన కుటుంబం, తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరింది. ఈ సందర్భంగా అన్నా కొణిదల తన మొక్కును తీర్చుకున్నారు.

Anna Konidela
Anna Konidela

డిక్లరేషన్, వరాహ స్వామి దర్శనం, తలనీలాలు సమర్పణ (TTD declaration)

టీటీడీ నిబంధనల ప్రకారం గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేసిన ఆమె, అనంతరం శ్రీ వరాహ స్వామి దర్శనం చేశారు. పద్మావతి కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించారు.

సుప్రభాత సమయంలో శ్రీవారి దర్శనం (Anna Konidela devotional)

సోమవారం వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం టీటీడీ అధికారులకు నిత్య అన్నదానానికి విరాళం అందించి, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం స్వీకరించనున్నారు.

మొక్కుతో దేశ‌వ్యాప్త చ‌ర్చ‌ (Pawan Kalyan family Tirumala)

పవన్ కల్యాణ్ కుటుంబం భక్తిభావంతో తీర్చిన మొక్కులను ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. తిరుమలలో జరిగిన ఈ కార్య‌క్ర‌మం ఎవ‌రూ ఊహించ‌లేదు. Anna Konidela Tirumala visit చేసి త‌ల నీలాలు స‌మ‌ర్పించ‌డం ఇప్ప‌డు పెద్ద చ‌ర్చ‌గా మారింది.

Anna Konidela mark shankar
Anna Konidela mark shankar

Leave a Comment