AmbedkarJayanti : అంబేడ్క‌ర్‌కు నివాళి అర్పించిన ఏపీ ప్ర‌భుత్వ విప్

AmbedkarJayanti

నందిగామ (GarudaNetram.com): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని AmbedkarJayanti పురస్కరించుకుని నందిగామలో రాష్ట్ర ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య Tangirala Soumya ఘనంగా నివాళులు అర్పించారు.  కాకాని నగర్‌లోని తన కార్యాలయం వద్ద, 9వ వార్డు ముక్కపాటి కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పౌరుని నైతిక అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది” అని పేర్కొన్నారు. అంబేద్కర్ BR Ambedkar అలాంటి మార్గదర్శకునిగా భారత రాజ్యాంగాన్ని Constitution of India రచించి అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చారని అన్నారు. ఆయన పోరాటాలు నేటి సమాజానికీ స్ఫూర్తిదాయకమని, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయన నిలువెత్తు చిహ్నంగా నిలిచారని తెలిపారు.

ఎస్సీ సెల్ నేతలు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతరత్న అంబేద్కర్ లాంటి మహనీయుడు భారతదేశ ఔన్నత్యాన్ని, సమానత్వ స్ఫూర్తిని ప్రపంచానికి AmbedkarJayanti చాటిన గొప్ప నేతగా ఆమె కొనియాడారు.

AmbedkarJayanti
AmbedkarJayanti

Leave a Comment