Amaravati : అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు మంజూరు

AP Raj Bhavan

అమరావతిలో గవర్నర్ కార్యాలయం, నివాస సముదాయం, అతిథి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం Amaravati రూ.212.22 కోట్లు మంజూరు చేసింది. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మొత్తం రూ.212.22 కోట్లు మంజూరుచేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8న జరిగిన సీఆర్డీఏ (CRDA) 53వ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌లో భాగంగా గవర్నర్ నివాస సముదాయం, సమావేశ మందిరం, కార్యాలయం, రెండు అతిథి గృహాలు, ఆరు ఆఫీసు క్వార్టర్లు నిర్మించనున్నారు. రాజ్ భవన్ నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతిలో గవర్నర్ స్థాయి కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధానిలో కీలక ఈ రెండు అతిథి గృహాలు Amaravati కీల‌కంగా మార‌నున్నాయి.

Leave a Comment