అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత రాజధాని అమరావతి నిర్మాణంపై amaravati Construction కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, రాజధానిని పునర్నిర్మాణ దిశగా కీలకంగా ముందుకెళ్తూ, ఈరోజు శాశ్వత సచివాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను విడుదల చేసింది.
సీఆర్డీఏ విడుదల చేసిన ప్రకటన మేరకు నాలుగు సచివాలయ టవర్లు, ఒక హెచ్‌వోడీ కార్యాలయం నిర్మించనున్నారు. మొత్తం వ్యయం రూ.4,668 కోట్లు. ఈ టెండర్ల ప్రకారం,
హెచ్‌వోడీ టవర్ కోసం రూ.1,126 కోట్లు
సచివాలయ టవర్ 1, 2 కోసం రూ.1,897 కోట్లు
టవర్ 3, 4 కోసం రూ.1,664 కోట్ల టెండర్లు పిలవబడ్డాయి.
మే 1న టెక్నికల్ బిడ్ల పరిశీలన, అనంతరం నిర్మాణ బాధ్యతలు కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.
మోదీ పర్యటనకు ముందు స్పష్టత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2న రాష్ట్ర పర్యటనకు రానుండటంతో, రాజధాని నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో వాయిదాలపై వచ్చిన విమర్శలను అధిగమించి, ఈసారి నిర్మాణాలను పూర్తి చేయాలనే సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
రెండో విడత భూసేకరణపై దృష్టి
భవనాల నిర్మాణానికి అవసరమైన భూముల కోసం ప్రభుత్వం రెండో విడత భూసేకరణకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో శాసనసభ, హైకోర్టు, ఎయిర్‌పోర్టు వంటి కీలక నిర్మాణాలకు వేల ఎకరాల భూములు అవసరం కానున్నాయి.
ఎన్నికల ముందు నిర్మాణాలు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం
రాబోయే ఎన్నికల ముందు అమరావతిలో స్పష్టమైన పురోగతి చూపించాలన్నamaravati Construction లక్ష్యంతో ప్రభుత్వం నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాజధానిని తీర్చిదిద్దాలన్న చంద్రబాబు అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ, మరిన్ని టెండర్లు త్వరలోనే విడుదల కానున్నాయి.