అమరావతిలో నిర్మాణ పనుల వేగవంతానికి అవసరమైన గ్రావెల్ కొండలను Amaravathi మంత్రి నారాయణ, సీఆర్డీయే మరియు గనుల శాఖలతో కలిసి పరిశీలించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణ వేగవంతం: అనంతవరం కొండ వద్ద మంత్రి నారాయణ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన వనరులపై మంత్రి పొంగూరు నారాయణ సోమవారం సమీక్ష నిర్వహించారు. అమరావతి సమీపంలోని అనంతవరం వద్ద గ్రావెల్ అవసరాల కోసం సీఆర్డీయే, గనుల శాఖ అధికారులతో కలిసి పర్యటన నిర్వహించారు.
గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఆలస్యం
మంత్రి నారాయణ మాట్లాడుతూ, “గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టింది,” అని అన్నారు.
పనుల పురోగతి వివరాలు
- ఇప్పటి వరకు 68 పనులకు సంబంధించిన రూ. 42,360 కోట్లు విలువైన టెండర్లు పూర్తయ్యాయి
- ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమయ్యాయి
- మొత్తం 92 పనులు రూ. 64,912 కోట్లతో చేపట్టబడ్డాయి
- గ్రావెల్ అవసరాల కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయేకు కేటాయించింది
- ఎయిర్‌పోర్ట్, మెగాసిటీ లక్ష్యం
అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనలను వివరించిన నారాయణ
- ఎయిర్‌పోర్ట్ కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరం
- ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే 30 వేల ఎకరాలు అవసరం
- భూసేకరణ చేస్తే రైతులకు నష్టం ఉండే అవకాశమున్నందున సమీకరణ చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు
- ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు
- నిర్మాణాల ముగింపు లక్ష్యం
మంత్రి నారాయణ మాట్లాడుతే “రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడల్ని కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలనే ముఖ్య Amaravathi లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అని తెలిపారు.
