ICUలో అలేఖ్య చిట్టి.. వైరల్ వీడియో తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలు Alekhya Chitti Pickles

Alekhya Chitti ICU

వైరల్ అయిన ఆడియో, సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా అలేఖ్య చిట్టి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతున్నAlekhya Chitti Pickles ఆమె పరిస్థితిపై కుటుంబ సభ్యులు స్పందించారు.

గరుడనేత్రం డెస్క్:
పచ్చళ్ళ వ్యాపారం ద్వారా పేరు సంపాదించుకున్న అలేఖ్య చిట్టి (Alekhya Chitti Pickles) ప్రస్తుతం తీవ్ర ఆరోగ్య సమస్యలతో ICUలో చేరినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఆడియో వైరల్ కావడం, మిమ్స్, ట్రోల్స్ ముమ్మరంగా రావడం వల్ల ఆమె డిప్రెషన్కు లోనైందని సమాచారం.

ఎందుకు అంతా రేట్లు

ఒక కస్టమర్ “ఇంత రేటా?” అని అడిగినందుకు పచ్చి భూతులు తిట్టిన ఆడియో క్లిప్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయింది. దీనితో అలేఖ్యపై విమర్శల వర్షం కురిసింది. లక్షల్లో వ్యూస్, వేలల్లో మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆసుపత్రిలో చేరిన అలేఖ్య

ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె అక్క మాట్లాడింది. “తన చెల్లికి శ్వాస సమస్య వచ్చింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలో చేర్చాం. ICUలో ఉంది. కృత్రిమ ఆక్సిజన్‌తో శ్వాస తీసుకుంటోంది,” అని అక్క తెలిపింది.

కుటుంబ సభ్యుల ఆవేదన

“తన తప్పు ఒప్పుకుంది. సారీ చెప్పింది. అయినా సోషల్ మీడియా ట్రోలింగ్ ఆగడం లేదు. మా నాన్న చనిపోయి మూడే నెలలు అయ్యాయి. మేము మళ్లీ బాధ తట్టుకోలేము,” అంటూ అక్క భావోద్వేగంతో తెలిపింది. “పచ్చళ్ళ బిజినెస్ కాబట్టి ఓ చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు. కానీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అనుకోలేదు” అని ఆమె తెలిపింది.

GarudaNetram Message

సోషల్ మీడియా వినియోగంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి జీవితాన్ని మారుస్తుందో, ఎవరి మనసును గాయపరుస్తుందో మనకు తెలియదు. అలేఖ్య చిట్టి Alekhya Chitti Pickles త్వరగా కోలుకోవాలని GarudaNetram తరపున ఆకాంక్షిస్తున్నాం.

Alekhya Chitti ICU

Alekhya Chitti ICU

మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పంచుకోండి. అలేఖ్యకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా?
ఇలాంటి మరిన్ని నిజమైన వార్తల కోసం GarudaNetram.com ని ఫాలో అవ్వండి.

 

Leave a Comment