ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులకు ఇక నుంచి గట్టినిర్ణయం. రాష్ట్రవ్యాప్తంగా ఏఐ AI cameras ఆధారిత కెమెరాలతో ఆటోమేటిక్‌గా ఫైన్ విధించే చర్యలు ప్రారంభమయ్యాయి.
- రాష్ట్రవ్యాప్తంగా ఏఐ కెమెరాలతో ఆటోమేటిక్ ఫైన్‌లు
- ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు ఇక నుంచి తప్పించుకునే మార్గం లేదు
రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకునే దిశగా రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలను ఆపకుండానే ఆటోమేటిక్‌గా ఫైన్ వేసే విధంగా చర్యలు చేపట్టింది. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే కెమెరాలను రాష్ట్రం అంతటా ఏర్పాటు చేయనుంది.
ravana shaakha ఆధ్వర్యంలో ఇప్పటికే 30 ప్రాంతాల్లో 60 ఏఎన్‌పీఆర్ (ANPR – Automatic Number Plate Recognition) కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.3.30 కోట్లు ఖర్చు చేయనున్నారు. పరిపాలన అనుమతులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ జారీ చేశారు. తద్వారా నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
ఈ కెమెరాలు వెహికిల్ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, AI సాయంతో వాహన వివరాలను తక్షణమే అధికారులు అందుకునేలా చేస్తాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా, వాహనపు టాక్స్ చెల్లించకపోయినా, ఓవర్ లోడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘన జరిగినా – ఈ కెమెరాలు తక్షణమే గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం పంపిస్తాయి.
ఇప్పటికే కామారెడ్డి చెక్‌పోస్ట్ వద్ద ప్రయోగాత్మకంగా ఈ కెమెరాలను జూన్‌లో అమలు చేశారు. కేవలం క్షణాల్లోనే వాహన వివరాలు అందడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇదే టెక్నాలజీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు.
ఈ విధానం వల్ల రోడ్లపై ప్రతి వాహనాన్ని ఆపాల్సిన అవసరం లేకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై నిర్దిష్టంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫైన్ వేసే ప్రక్రియ పూర్తిగా డిజిటల్ కావడంతో పారదర్శకత పెరుగుతుంది.
వాహనదారులు నిబంధనలు పాటించకపోతే ఇకపై వాహనం ఆపకుండా జరిమానా మోపబడుతుంది. ప్రభుత్వం AI cameras అమలు చేస్తున్న ఈ ఆధునిక పద్ధతులు రోడ్ సేఫ్టీని మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.