ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య రాత్రిళ్లు పాముగా మారి కాటేస్తోందని చేసిన weird incident విచిత్ర ఫిర్యాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సీతాపూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ జిల్లా లోధ్సా గ్రామంలో ఓ వ్యక్తి చేసిన విచిత్ర ఫిర్యాదు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెరాజ్ అనే వ్యక్తి తన భార్య నసీమున్ రాత్రిపూట పాముగా మారి తాను నిద్రపోతున్నప్పుడు కాటేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను పేర్కొన్న ప్రకారం, “ప్రతి రాత్రి ఆమె పాములా మారి నా దగ్గరకి వచ్చి నన్ను కాటేయడానికి ప్రయత్నిస్తుంది. నా ప్రాణం ప్రమాదంలో ఉంది” అని వాపోయాడు. ఈ ఫిర్యాదు స్థానిక పోలీసులను కూడా గందరగోళానికి గురి చేసింది. మొదట ఇది సరదాగా తీసుకున్నా, సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో జిల్లా మెజిస్ట్రేట్ దృష్టికి చేరింది. వెంటనే ఆయన పోలీసులు దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు ఆ దంపతుల మానసిక స్థితి, వాస్తవ పరిస్థితులపై విచారణ చేపడుతున్నారు. గ్రామస్థులు మాత్రం ఈ ఘటనను weird incident ఆసక్తిగా గమనిస్తున్నారు.
weird incident : నా భార్య పాముగా మారిపోయింది… భర్త ఏం చేశాడంటే…
by గరుడ నేత్రం
Published On: October 8, 2025 11:44 am
