విశాఖపట్నంలో దసరా రోజున విషాదం చోటుచేసుకుంది. తండ్రి అప్పు చేసి కొనిచ్చిన కొత్త బైక్‌పై వెళ్తూ యువకుడు Visakhapatnam accident హరీష్ ప్రమాదంలో మృతి చెందాడు.
అప్పు చేసి బైక్ కొనిస్తే తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చినాడు నాడు. విశాఖపట్నం – మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు కుమారుడు హరీష్ (19) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఇటీవల బైక్ కావాలని అడిగితే డబ్బుల్లేవని చెప్పిన తండ్రి. అయినా కుమారుడు వినకుండా అలిగి.. మొండిపట్టు పట్టడంతో చివరికి రూ.3లక్షలు అప్పు చేసి దసరా రోజున బైక్‌ను కొనిచ్చిన తండ్రి. అయితే టిఫిన్ చేయడానికి ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు స్నేహితుడు వినయ్‌తో కలిసి కొత్త బైక్ పై వెళ్లి.. టిఫిన్ చేసిన తరువాత స్నేహితుడిని ఇంటి వద్ద దించడానికి కాంప్లెక్స్ నుంచి మితిమీరిన వేగంతో వెళ్తుండగా సిరిపురం దత్ ఐలాండ్ మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన హరీష్. ప్రమాదంలో హరీష్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుకు హరీష్ మృతి. స్వల్పగాయాలతో బయటపడ్డ వెనకాల కూర్చున్న స్నేహితుడు వినయ్.. కేసు నమోదు చేసిన పోలీసులు. తస్మాత్ జాగ్రత్త మీ పిల్లలు ఏదీ అడిగినా వెంటనే కొనిస్తే చివరికి జరిగేది ఇదే.