Durga Dasara Utsavalu 2025 : దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ విడుదల – సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు

Durga Dasara Utsavalu 2025

విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు Durga Dasara Utsavalu 2025 జరుగనున్నాయి. అమ్మవారు 11 రోజుల పాటు 11 అలంకారాలలో దర్శనమిస్తారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శినా నాయక్ మరియు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. మొత్తం 11 రోజుల పాటు 11 అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

దుర్గగుడి స్థానాచార్య శివప్రసాద్ శర్మ వివరాల ప్రకారం అమ్మవారి అలంకారాలు ఈ విధంగా ఉంటాయి:

దుర్గమ్మ అలంకారాలు (2025)

  1. సెప్టెంబర్ 22: బాలత్రిపుర సుందరి దేవి
  2. సెప్టెంబర్ 23: గాయత్రీ దేవి
  3. సెప్టెంబర్ 24: అన్నపూర్ణాదేవి
  4. సెప్టెంబర్ 25: కాత్యాయని దేవి
  5. సెప్టెంబర్ 26: మహాలక్ష్మి దేవి
  6. సెప్టెంబర్ 27: లలితా త్రిపుర సుందరి దేవి
  7. సెప్టెంబర్ 28: మహాచండి దేవి
  8. సెప్టెంబర్ 29: సరస్వతి దేవి
  9. సెప్టెంబర్ 30: దుర్గాదేవి
  10. అక్టోబర్ 1: మహిషాసుర మర్దిని దేవి
  11. అక్టోబర్ 2: రాజరాజేశ్వరి దేవి

ప్రత్యేక కార్యక్రమాలు

  • అక్టోబర్ 2 ఉదయం 9:30కు: పూర్ణాహుతి తో ఉత్సవాల ముగింపు.
  • అదే రోజు సాయంత్రం 5 గంటలకు: కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం.
  • సెప్టెంబర్ 29 (మూల నక్షత్రం మధ్యాహ్నం 3:30 – 4:30): సీఎం Durga Dasara Utsavalu 2025 అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

Leave a Comment