D-Mart Business Strategy – డి-మార్ట్‌లో వస్తువులు ఎందుకు చౌకగా ఉంటాయి? రాధాకిషన్ద D Mart Business Modelమానీ వ్యూహం, హోల్‌సేల్ కొనుగోలు, తక్కువ ప్రకటనలు, మధ్యతరగతి మార్కెట్ టార్గెట్ – పూర్తి విశ్లేషణ.
D-Mart అంటే ఏమిటి?
2002లో ముంబైలో రాధాకిషన్ దమానీ స్థాపించిన D-Mart, నేడు దేశవ్యాప్తంగా 200కి పైగా దుకాణాలను కలిగి ఉంది. దీని వెనుక ఉన్న వ్యూహం అమెరికన్ Walmart మాదిరిగానే ఉంటుంది. అందుకే దీన్ని చాలామంది “India’s Walmart” అని పిలుస్తారు.
- ఎందుకు D-Martలో వస్తువులు చౌకగా ఉంటాయి?
1. హోల్‌సేల్ కొనుగోలు & నేరుగా విక్రయం - D-Mart పెద్దమొత్తంలో ఉత్పత్తులను హోల్‌సేల్ ధరలకు కొనుగోలు చేస్తుంది. రిటైలర్లను తప్పించి నేరుగా కస్టమర్‌కు అమ్ముతుంది. దీంతో ధరలు తక్కువగా ఉంటాయి.
- 2. విక్రేతలకు 15 రోజుల్లో చెల్లింపు
- ఇతర సూపర్మార్ట్లతో పోలిస్తే, D-Mart సరఫరాదారులకు కేవలం 15 రోజుల్లోనే చెల్లింపు చేస్తుంది. దీని వలన విక్రేతలు అదనపు తగ్గింపులు ఇవ్వడానికి సిద్ధపడతారు.
- 3. దుకాణాల కోసం స్థలాన్ని కొనుగోలు
- బహుశా సూపర్మార్కెట్లు అద్దె భవనాల్లో ఉంటాయి. కానీ D-Mart ఎక్కువగా తన దుకాణాలను సొంతంగా కొనుగోలు చేస్తుంది. దీని వలన అద్దె ఖర్చు ఉండదు.
- 4. మధ్యతరగతి కస్టమర్ టార్గెట్
- అన్ని స్టోర్లు మధ్యతరగతి నివాస ప్రాంతాల దగ్గర ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ ఎక్కువ ఫుట్‌ఫాల్ ఉంటుంది.
- 5. తక్కువ ఇన్వెంటరీ స్టోరేజ్
- D-Mart 1-2 నెలలకోసారి స్టాక్ రీ-ఫిల్ చేస్తుంది. దీని వలన నిల్వ ఖర్చు తక్కువ అవుతుంది.
- 6. ప్రకటనలపై తక్కువ ఖర్చు
- D-Mart TV, Radio, Digital Adsలపై పెద్దగా ఖర్చు పెట్టదు. స్థానిక హోర్డింగ్స్, న్యూస్‌పేపర్ డిస్కౌంట్ Ads మాత్రమే వాడుతుంది. మిగతా మార్కెటింగ్ Word of Mouth ద్వారానే జరుగుతుంది.
- 7. తక్కువ ఉద్యోగులు – తక్కువ ఖర్చు
- D-Mart తక్కువ క్యాష్ కౌంటర్లు, తక్కువ స్టాఫ్ ఉంచుతుంది. అంతేకాక, 60% మంది ఉద్యోగులు కాంట్రాక్టు ఆధారంగా నియమించబడతారు.
- 8. ఆన్లైన్ షాపింగ్ సౌకర్యం
- D-Mart ఇప్పుడు Online Shopping & Pick-up Store Concept కూడా అందిస్తోంది. దీంతో మరింత మంది కస్టమర్లను చేరుకుంటుంది.
- D-Mart సక్సెస్ సీక్రెట్
- తక్కువ ధరలు + ఎక్కువ ఫుట్‌ఫాల్
- తక్కువ ఖర్చులు + ఎక్కువ లాభాలు

- మధ్యతరగతి కస్టమర్లపై దృష్టి
D-Martలో వస్తువులు చౌకగా దొరకడం వెనుక బలమైన బిజినెస్ వ్యూహం ఉంది. అందులో ప్రధానంగా హోల్‌సేల్ కొనుగోలు, తక్కువ ప్రకటనలు, సొంత దుకాణాలు, సరఫరాదారులకు వేగంగా చెల్లింపులు చేయడం ఉన్నాయి. ఈ వ్యూహాల వలన D-Mart ఎల్లప్పుడూ కస్టమర్ల ప్రథమ ఎంపికగా నిలుస్తోంది.