తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో హరీష్ రావు కుట్ర ఉందని కవిత ఆరోపించారు. రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ అదే Kavitha Suspension పరిస్థితే వస్తుందని జోస్యం చెప్పారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సస్పెన్షన్ వెనుక హరీష్ రావు కుట్ర ఉందని ఆరోపించారు.
- రేపు కేసీఆర్, కేటీఆర్‌కూ ఇదే పరిస్థితి
- కవిత ప్రకారం, పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో హరీష్ రావు ముందుకెళ్తున్నారని అన్నారు.
- “నేడు నన్ను బయటకు పంపించారు… రేపు కేసీఆర్, కేటీఆర్‌లను కూడా ఇదే పరిస్థితికి గురిచేస్తారు” అని కవిత వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం స్కాం ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు భారీ అవినీతి చేశారని, ఆ డబ్బుతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేసారని కవిత ఆరోపించారు. అంతేకాక, కేటీఆర్‌ను ఓడించేందుకు సిరిసిల్లకు 60 లక్షల రూపాయలు పంపించాడని కూడా ఆరోపించారు.
హరీష్ – రేవంత్ స్నేహం?
ప్రభుత్వం మారిన తర్వాత హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో వెళ్లారని కవిత ప్రశ్నించారు. రేవంత్ కు హరీష్ రావు పూర్తిగా సరెండర్ అయ్యారని, హాస్టళ్లకు హరీష్ రావు డెయిరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.
“ట్రబుల్ షూటర్ కాదు… డబుల్ షూటర్”
- హరీష్ రావు మొదటి నుంచే కేసీఆర్ వెంట లేరని కవిత అన్నారు.
- టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కేసీఆర్ రాజీనామా చేస్తున్నప్పుడు హరీష్ అడ్డుకున్నారని
- వైఎస్‌ను కూడా కలిసారని పార్టీ పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టేశారని ఆరోపించారు.
- కవిత మాట్లాడుతూ, “హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు… డబుల్ షూటర్” అని వ్యాఖ్యానించారు.
సంతోష్ రావుపై ఆరోపణలు
- సంతోష్ రావుపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు.
- మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టు
- గ్రీన్ ఇండియా పేరిట నకిలీ ప్రోగ్రాంలు
- ఫారెస్ట్ భూములపై కుట్రలు అని ఆరోపించారు.
“బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటేనా? ప్రజలకు బంగారు తెలంగాణ వచ్చిందా?” అని ప్రశ్నించారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం
కవిత చేసిన ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు బహిర్గతం కావడంతో బీఆర్‌ఎస్ Kavitha Suspension భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదానిపై చర్చ మొదలైంది.