Nandigama : నందిగామలో అన్నదాత సుఖీభవ భారీ ట్రాక్టర్ ర్యాలీ

nandigama tractor ryali

నందిగామలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే Nandigama తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ పండుగ వాతావరణంలో సాగింది.

నందిగామ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పట్ల రైతులు కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందిగామలో భారీ స్థాయిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

tractor ryali in nandigama (7)
tractor ryali in nandigama (7)

కూటమి నేతల సమక్షంలో, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని స్థానిక శ్రీ సాయి అయ్యప్ప దేవాలయం వద్ద లాంచనంగా ప్రారంభించారు. ప్రధాన రహదారుల మీదుగా సాగిన ట్రాక్టర్ ర్యాలీ పండుగ వాతావరణంలో, రైతుల హర్షధ్వానాలతో సాగింది. పెద్ద సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో పాల్గొని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

tractor ryali in nandigama (7)
tractor ryali in nandigama (7)

గాంధీ సెంటర్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే సౌమ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000, పీఎం-కిసాన్ పథకంలో కేంద్రం రూ.2,000 జమ చేసిందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని తెలిపారు.

tractor ryali in nandigama (7)
tractor ryali in nandigama (7)

అలాగే గత వైయస్సార్సీపీ పాలనలో విగ్రహా రాజకీయాలు జరిగాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని విగ్రహాలకు సమన్యాయం చేస్తున్నామని తెలిపారు. ఇటీవల గాంధీ సెంటర్లో ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారని, దీనిలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

tractor ryali in nandigama (7)
tractor ryali in nandigama (7)

ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

tangirala sowmya
tangirala sowmya

Leave a Comment