శ్రావణ మాసం ప్రారంభంతో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. జులై 26 నుంచి నవంబర్ 30 వరకు Wedding Muhurtham 2025 పెళ్లికి అనుకూలమైన శుభ ముహూర్తాలు ఇవే అని పండితులు తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ శుభాల సందడి మొదలవుతోంది. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుండటంతో పెళ్లిళ్లకు అనుకూలమైన ముహూర్తాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి.
పండితుల ప్రకారం, జులై 26వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అనేక శుభ ముహూర్తాలు లభ్యమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు నిలిచిపోయిన పరిస్థితే నెలకొంది. ఇక ఇప్పుడు పెళ్లి బాజాలు మోగనున్నాయి.
అయితే, భాద్రపద మాసం (ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 21 వరకు) శుభ ముహూర్తాలు లేవని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు విరామం ఉండే అవకాశం ఉంది.
wedding dates
పెళ్లిళ్లు ప్లాన్ చేస్తున్న వారికి సూచనలు:
ముందస్తు హాల్ బుకింగ్ చేయడం మంచిది, ఎందుకంటే ముహూర్తాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ డిమాండ్ కూడా Wedding Muhurtham 2025 ఎక్కువే. గృహప్రవేశం, అక్షింతలు, పిలిచి చూపించడాలు వంటి శుభకార్యాలకు కూడా ఇదే రోజులు అనుకూలం.