50 ఏళ్ల వ్యక్తి గత కొంతకాలంగా మెమోరీ లాస్, కడుపు నొప్పి, కాళ్లలో నొప్పి Lead Poisoning వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. కానీ సాధారణ రిపోర్టుల్లో సమస్య కనిపించకపోవడంతో, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్టు డాక్టర్ విశాల్ గబాలే హెవీ మెటల్ స్క్రీనింగ్ చేశారు. ఫలితంగా లెడ్ పాయిజనింగ్ స్థాయులు బయటపడ్డాయి.
20 ఏళ్ల కుక్కర్ వల్ల విపత్కర పరిస్థితి
విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. గత 20 ఏళ్లుగా ఒకే అల్యూమినియం ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తున్న భార్య వాడిన పాత, పాడైన కుక్కర్ నుంచే లెడ్ (సీసం) మరియు అల్యూమినియం కణాలు ఆహారంలోకి చేరి శరీరంలో దాచుకుపోయినట్టు తేలింది. “లెడ్ స్థాయిలు డెసిలీటర్‌కు 22 మైక్రోగ్రాములకు పైగా ఉండడం చాలా ప్రమాదకరం,” అని డాక్టర్ గబాలే పేర్కొన్నారు.
లెడ్ పాయిజనింగ్‌తో వచ్చే ప్రధాన లక్షణాలు:
- కడుపులో తిమ్మిరిగా ఉండటం
- మెమోరీ లాస్
- శృంగార సామర్థ్యం తగ్గిపోవడం
- మూత్రపిండాల సమస్యలు
- వాంతులు, వికారం, తలనొప్పి
- నరాల బలహీనత
- వ్యంధ్యత సమస్యలు
శాస్త్రీయంగా నిర్ధారణ – చికిత్సలో పునరుద్ధారం
రోగికి కీలేషన్ థెరపీ ద్వారా చికిత్స ప్రారంభించగా ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. Lead Poisoning పాత వంటపాత్రల వల్ల వచ్చే ప్రమాదాన్ని చాలా మంది పట్టించుకోరని, ఇది ఎంతోమందిలో దీర్ఘకాలిక ప్రభావాలు చూపే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
మీకు సూచనలు:
- పాత అల్యూమినియం ప్రెజర్ కుక్కర్‌లు వెంటనే మార్చండి
- స్టీల్, కాస్ట్ ఐరన్, లేదా ISI మార్క్ ఉన్న నాన్ టాక్సిక్ మెటీరియల్స్ వాడండి
- తరచూ వాడే వంటపాత్రల పరిస్థితిని సమీక్షించండి.