దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీల పెంపు – అన్ని తరగతుల్లో కొత్త ఛార్జీలు అమల్లోకి
భారతీయ రైల్వే ప్రయాణికులకు ఓ కీలక సమాచారం. railway fare hike July 2025 రైల్వే ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెంపు తక్షణం అమలులోకి వచ్చిందని రైల్వే శాఖ ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో అన్ని తరగతుల్లోనూ కిలోమీటరుకు కొన్ని పైసల చొప్పున పెంపు విధించినట్లు స్పష్టం చేసింది.
పెరిగిన ఛార్జీలు – వివరాలు ఇలా…
\ ఏసీ తరగతులు:
ఎక్స్‌ప్రెస్ / మెయిల్ (ఏసీ) – కిలోమీటరుకు ₹2 పైసలు పెంపు.
నాన్-ఏసీ తరగతులు:
ఎక్స్‌ప్రెస్ / మెయిల్ (నాన్-ఏసీ) – కిలోమీటరుకు ₹1 పైసా చొప్పున పెంపు.
ఆర్డినరీ స్లీపర్ క్లాస్ – కిలోమీటరుకు ₹0.50 పైసలు చొప్పున పెంపు.
ఆర్డినరీ సెకండ్ క్లాస్ – దూరం ఆధారంగా:
500 కి.మీ వరకు – చార్జీలు యథాతథం.
501 కి.మీ – 1500 కి.మీ – ₹5 పెంపు.
1501 కి.మీ – 2500 కి.మీ – ₹10 పెంపు.
2501 కి.మీ – 3000 కి.మీ – ₹15 పెంపు.
ప్రయాణికులపై ప్రభావం:
ఈ తాజా ఛార్జీల పెంపుతో రైలు ప్రయాణ ఖర్చులు స్వల్పంగా పెరగనున్నాయి. ముఖ్యంగా ఎక్కువ దూరాల ప్రయాణికులకు ఇది ప్రభావం చూపనుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ ఛార్జీలు జూలై 2వ తేదీ (మంగళవారం) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
రైల్వే శాఖ వివరణ:
ఈ పెంపు అంతగా భారంగా ఉండదని, నిర్వహణ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో చిన్నస్థాయిలోనే ఛార్జీలు పెంచామని అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త వసతులు, ట్రైనింగ్ వాహనాలు, railway fare hike July 2025 మెరుగైన హైజీనిక్ ఫెసిలిటీల కోసం ఈ ఫండ్స్ వాడుతామని చెప్పారు.