హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంటి వద్ద Jubilee Hills statue issue అర్ధరాత్రి బయటపడ్డ కాంక్ష విగ్రహం కలకలం రేపింది. మహిళా సంఘాలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త నివాస సమీపంలో అర్ధరాత్రి వెలిసిన కాంక్ష విగ్రహం పెద్ద దుమారం రేపుతోంది. ఈ విగ్రహం ప్రజా స్థలంలో ఏర్పాటు చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మహిళల ఆందోళన – పిల్లల భద్రతపై భయం
ఈ విగ్రహం బయట ఉండడం వల్ల తల్లులు తమ పిల్లల పట్ల భయభ్రాంతులకు లోనవుతున్నారు. “ఇలాంటి విగ్రహాలు బహిరంగ ప్రదేశాల్లో పెట్టడం సభ్య సమాజానికి తలదించుకునే విషయం” అని పలువురు మహిళలు మండిపడుతున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు, అధికారులు నిర్లక్ష్యం
విగ్రహం పెట్టిన ప్రాంతం ప్రధాన రహదారి సమీపం కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించినప్పటికీ, ప్రముఖ వ్యాపారవేత్త సంబంధిత వ్యక్తి కావడంతో అధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
మహిళా సంఘాల స్పందన కోసం ఎదురుచూప
ఇప్పటివరకు మహిళా సంఘాలు ఈ విషయంపై ప్రత్యక్షంగా స్పందించనప్పటికీ, వీరి స్పందన ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. Jubilee Hills statue issue సంఘటనపై సివిల్ సొసైటీ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.