ఆంధ్రప్రదేశ్‌లో “తల్లికి వందనం” పథకం అమలుపై రాష్ట్ర హోంమంత్రి thalliki vandanam వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా ఉద్దండపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని జూన్ 15లోపు తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించారు. హోంమంత్రి అనిత వెల్లడించిన వివరాల ప్రకారం, స్కూళ్లు రీ-ఓపెన్ అయిన అనంతరం పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా, ప్రతి ఒక్కరికీ రూ.15,000 చొప్పున వార్షికంగా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం విద్యా ప్రోత్సాహానికి, తల్లుల ఆర్థిక భద్రతకు దోహదపడుతుందని thalliki vandanam మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది తల్లులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.
thalliki vandanam : తల్లికి వందనం” డబ్బులు ఇచ్చేది అప్పడే..
by గరుడ నేత్రం
Published On: June 1, 2025 11:19 am






