రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ తెరుచుకున్న చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ ration shops reopen సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. జూన్ 1వ తేదీ నుంచి మొత్తం 29,760 రేషన్ దుకాణాలు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి.
ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. చౌక ధరల దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో వెళ్లి సరుకులు తీసుకునే అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఒక కోటి 46 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకులు నిరాటంకంగా అందించేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. అలాగే ప్రతి నెలా సుమారు 16 లక్షల దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటికే రేషన్ సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రజల మేలు కోరికే తమ ప్రభుత్వ లక్ష్యమని ration shops reopen కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.






