APJobs2025 : ఏపీలో ఉద్యోగులకు తీపి కబురు..

AP Court Recruitment

ఏపీ ప్రభుత్వం న్యాయ విభాగంలో 1620 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలAPJobs2025  చేసింది. జిల్లాలవారీగా ఉద్యోగాల వివరాలు, అర్హతలు, దరఖాస్తు తేదీలు ఇవే.

ఏపీలో నిరుద్యోగులకు మరోసారి అందమైన అవకాశాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీ 2025 ద్వారా 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా న్యాయ విభాగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1620 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది.

ఖాళీల విభజన (Post-wise Vacancies):
జూనియర్ అసిస్టెంట్ – 230 పోస్టులు

ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) – 651 పోస్టులు

ప్రాసెస్ సర్వర్ – 164 పోస్టులు

రికార్డ్ అసిస్టెంట్ – 24 పోస్టులు

కాపీయిస్ట్ – 193 పోస్టులు

ఎగ్జామినర్ – 32 పోస్టులు

ఫీల్డ్ అసిస్టెంట్ – 56 పోస్టులు

టైపిస్ట్ – 162 పోస్టులు

స్టెనోగ్రాఫర్ – 80 పోస్టులు

డ్రైవర్ – 28 పోస్టులు

అర్హతలు (Eligibility):
సబార్డినేట్ పోస్టులకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత అవసరం

జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ తప్పనిసరి

టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ వంటివి ఇంటర్ లేదా డిగ్రీతో పాటు సంబంధిత టెక్నికల్ అర్హతలు ఉండాలి

టైపింగ్/కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి

గరిష్ట వయస్సు: 42 ఏళ్లు

దరఖాస్తు వివరాలు (Application Details):
దరఖాస్తు ప్రారంభం: మే 13, 2025

చివరి తేదీ: జూన్ 2, 2025

ఫీజు:

OBC/EWS: ₹800

SC/ST/దివ్యాంగులు: ₹400

అధికారిక వెబ్‌సైట్: https://aphc.gov.in/aphc_old/

ఎంపిక విధానం (Selection Process):
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.

ఏపీ కోర్టుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది APJobs2025 సువర్ణావకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.

Leave a Comment