Kavitha joins Congress : కాంగ్రెస్ లోకి కవిత.. అసలు విషయం ఇదే..

Kavitha Revanth Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారా? Kavitha joins Congress మధ్యవర్తుల ద్వారా హైకమాండ్‌ను కలిసారన్న వార్తల మధ్య, కాంగ్రెస్ లో అంతర్గత వ్యూహాలు వేడెక్కుతున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కవిత పేరు చర్చల్లోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం, రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. ఇటీవల ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్‌తో ఆమె చర్చలు జరుపుతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి.

వార్తల ప్రకారం, ఓ మధ్యవర్తి ద్వారా ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్‌ను సంప్రదించారని, ఈ విషయం కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో కలహాలకు కారణమవుతున్నామన్న విమర్శలు రావొచ్చన్న భావనతో, రేవంత్ రెడ్డి తక్షణంగా కవితను పార్టీలోకి తీసుకోవొద్దని సూచించినట్లు తెలుస్తోంది.

కవితపై కాంగ్రెస్ దృష్టి:
కవిత కాంగ్రెస్‌లో చేరితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలోకి రావొచ్చన్న అంచనాలు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో కవితను అంగీకరించకుండా ఉంటే, ఆ అవకాశాలు కోల్పోతామన్న ఆందోళన కూడా కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది.

కొత్త పార్టీ లేదా కుటుంబ రాజీ?
ఇక కవిత తన రాజకీయ భవిష్యత్తును స్వతంత్రంగా ముందుకు నడిపించాలా? లేక కేసీఆర్, కేటీఆర్‌లు నడిపే బీఆర్ఎస్‌లో కొనసాగాలా? అన్నది కీలకమైన అంశంగా మారింది. జాగృతి శాఖల పునఃస్థాపన, కార్యకలాపాల బలోపేతం ద్వారా కవిత తన సత్తాను చూపించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆమె వర్గాలు చెబుతున్నాయి.

అయితే బీఆర్ఎస్ వర్గాల నమ్మకం ప్రకారం, చివరి నిమిషంలో అయినా కేసీఆర్ స్వయంగా కవితను బుజ్జగించి, పార్టీలో కొనసాగేలా చూసే అవకాశాలున్నాయి.

కవిత భవిష్యత్ ప్రయాణం ఏ దిశలో సాగుతుందన్నది Kavitha joins Congress రాజకీయంగా ఆసక్తికర అంశంగా మారింది. కాంగ్రెస్‌లో చేరే అవకాశమా? స్వతంత్ర రాజకీయ కృషికే మొగ్గుచూపుతారా? లేక బీఆర్ఎస్‌లోనే మళ్లీ చొరవ చూపుతారా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

Leave a Comment