జగ్గయ్యపేట నియోజకవర్గ రేషన్ డీలర్లు RationDealers ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ పంపిణీ పునఃప్రారంభంపై ఎమ్మెల్యే తాతయ్య హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. రేషన్ పంపిణీ విధానాన్ని రేషన్ షాపుల ద్వారా మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, జగ్గయ్యపేట నియోజకవర్గ రేషన్ డీలర్లు శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్యల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. వారి కష్టాలను అర్థం చేసుకుని ప్రతి నిర్ణయం తీసుకుంటుంది,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో RationDealers నియోజకవర్గానికి చెందిన పలువురు రేషన్ డీలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
RationDealers : కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్లకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
by గరుడ నేత్రం
Published On: May 24, 2025 11:06 am






