AP ration card : కొత్త రేష‌న్‌కార్డు కావాలా అయితే ఇలా చేయండి

AP ration card

ఆంధ్రప్రదేశ్‌లో అర్హత ఉన్నవారికి రేషన్ కార్డులు పొందడం AP ration card ఇప్పుడు మరింత సులభమైంది. రేషన్ కార్డు కోసం వాట్సాప్‌లోనే అప్లై చేయవచ్చు. కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది.

వాట్సాప్ ద్వారా రేషన్ కార్డ్ కోసం అప్లై చేయడం ఇలా:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మే 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డుల అప్లికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం 9552300009 వాట్సాప్ నెంబర్‌కు “హాయ్” అని మెసేజ్ పంపితే సరి. అనంతరం కావాల్సిన వివరాలు, డాక్యుమెంట్లు పంపించడం ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు.

సచివాలయాల ద్వారా రేషన్ కార్డు అప్లికేషన్
వాట్సాప్ ద్వారా మాత్రమే కాకుండా, రేషన్ కార్డులు కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7వ తేదీ నుంచి జూన్‌ 7వ తేదీ వరకు సచివాలయాల ద్వారా కొత్త బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు కూడా ఈ సమయంలో చేయవచ్చు.

ముఖ్య సూచనలు:
రేషన్ కార్డుకు అర్హత కలిగినవారు మాత్రమే అప్లై చేయాలి.

సమాచారాన్ని సరిగ్గా అందించి, అవసరమైన డాక్యుమెంట్లు జతపరచాలి.

రేషన్ కార్డు స్వీకరించిన తర్వాత దాని వివరాలు సరిచూసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం వల్ల రేషన్ కార్డు పొందడం AP ration card మరింత వేగవంతం కానుంది.

Leave a Comment