Nandigama news : ఏఐ సాయంతో బాలిక అప్పగింత

irl rescued in Nandigama

2025 ఏప్రిల్ 26న రాత్రి 11 గంటల సమయంలో, ఎన్టీఆర్ జిల్లా నందిగామ Nandigama news మండలం అనాసాగరం గ్రామంలో ఓ 13 ఏళ్ల బాలిక ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సందర్భం మహిళా, బాలికల భద్రతకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన శక్తి టీం వెంటనే స్పందించింది. ఎస్సై బి. అభిమన్యు, ఉమెన్ కానిస్టేబుల్ శ్రీమతి కవిత, ఏఎస్ఐ రవికుమార్ కలిసి బాలికను రక్షణగా తీసుకుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు.

బాలిక పూర్తి వివరాలను వెల్లడించలేని స్థితిలో ఉండటంతో, సి-ట్రేస్ మరియు చాట్ జిపిటి వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి బాలిక పూర్తి సమాచారం తెలుసుకున్నారు. బాలిక పేరు మమతా దేవి, స్వస్థలం బీహార్ రాష్ట్రం అని గుర్తించారు.

బీహార్‌లోని సంబంధిత పోలీసులకు సమాచారం ఇచ్చి బాలిక తల్లిదండ్రులను కనుగొన్నారు. వారు ప్రస్తుతం విజయవాడ సమీపంలోని గంగూరు గ్రామంలో సుతారి పనులకు వచ్చారని తెలిసింది. మధ్యాహ్నం ఆడుకుంటూ బయటికి వచ్చిన బాలిక మార్గం తప్పి నందిగామ చేరిందని స్పష్టమైంది.

అర్థరాత్రి అయినా, శక్తి టీం ప్రత్యేక శ్రద్ధతో బాలికను తల్లిదండ్రులు రేతాదేవి మరియు శివ నారాయణ సాహూ చేతికి సురక్షితంగా అప్పగించింది. తమ పిల్లను త్వరితగతిన రికవర్ చేసిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంలో నందిగామ టౌన్ ప్రజలు శక్తి టీం చర్యలను కొనియాడారు. ఎస్సై బి. అభిమన్యు మాట్లాడుతూ “ఎన్టీఆర్ జిల్లా సీపీ గారి మార్గదర్శకత్వంలో మహిళలు, బాలికల భద్రతను టాప్ ప్రియారిటీగా తీసుకుని పని చేస్తున్నాం. ఈ విజయానికి నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ ఏబీజీ తిలక్ గారు మరియు నందిగామ టౌన్ ఎస్హెచ్ఓ వై.వి.ఎల్.వి. నాయుడు గారి నాయకత్వం ప్రధాన కారణం” అని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో Nandigama news ఆధారాల్లేకుండా బాలికను గుర్తించి తల్లిదండ్రులకు చేర్చిన పోలీసుల చొరవ అభినందనీయం.

Leave a Comment