జగ్గయ్యపేట పట్టణంలోని చెరువు బజారు అట్టా వద్ద రోజువారీ Jaggayyapeta Accident కూలి పని చేసుకుంటున్న వ్యక్తులపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న వత్సవాయి ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు తక్షణమే ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వైద్యులను కలిసి వారి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్న ఆయన, మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
ప్రమాద స్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గారు, పోలీసులతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల Jaggayyapeta Accident వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
గాయపడిన బాధితుల వివరాలు:
ఓర్సు రామకృష్ణ
తాళ్లూరి వాసు
బండి నాగరాజు
కుంచపు నాగరాజు
బత్తుల వెంకట గురువులు
