విజయవాడ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ కేశినేని నాని Kesineni Nani ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నాని తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖతో రాజకీయ వేడి పెరిగింది. తమ్ముడు కేశినేని చిన్ని ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్ర చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
నాని లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇవే:
విశాఖపట్నంలో డేటా సెంటర్ ప్రాజెక్టు పేరుతో “ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్” అనే కొత్త కంపెనీకి 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని పేర్కొన్నారు.
ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం లేకుండా, డైరెక్టర్లు కేశినేని చిన్ని బినామీలేనని ఆరోపించారు.
భూ కేటాయింపు వెనుక స్వార్థపూరిత ప్రయోజనాలున్నాయని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
తమ్ముడు చిన్ని మైనింగ్, రియల్ ఎస్టేట్, గ్యాంబ్లింగ్ లాంటి అక్రమాల్లో ప్రమేయం కలిగి ఉన్నట్టు ఆరోపణలు చేశారు.
చంద్రబాబు పాలనపై ప్రజలు నమ్మకం కలిగేలా, ఈ భూ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని, విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ లేఖతో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేగింది. కేశినేని Kesineni Nani కుటుంబంలో కలహాలు బహిర్గతం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు స్పందనపై కూడా రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.