Andhra Pradesh SC law 2025 ఎస్సీ వర్గీకరణ ఆపండంటు పిటిషన్.. కోర్టు కీలక ఆదేశాలు

Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ Andhra Pradesh SC law 2025 చట్టం-2025పై రాజ్యాంగ విరుద్ధత ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎస్సీ వర్గానికి చెందిన కనుకుంట్ల మంగ అనే మహిళ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమా ఈ చట్టం?
తాజాగా ప్రారంభించిన ఈ చట్టంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మరియు జస్టిస్ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాశ్ కుమార్ వాదనలు వినిపించారు.

ఈ చట్టం సుప్రీంకోర్టు ‘దావిందర్ సింగ్ vs పంజాబ్ స్టేట్’ కేసు తీర్పుకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఆ తీర్పులో క్రీమీలేయర్ విధానం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొనగా, ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

కమిషన్ సిఫార్సులు కూడా పట్టించుకోలేదా?
రాజ్య ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చిన సిఫార్సులు కూడా ఉన్నప్పటికీ, వాటిని పాటించకుండా రాజ్యాంగ విరుద్ధంగా చట్టం తీసుకొచ్చారని పిటిషనర్ వాదన. ఈ చట్టాన్ని నిలిపివేయాలని, తదుపరి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

హైకోర్టు స్పందన
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు Andhra Pradesh SC law 2025 జారీ చేసింది. తదుపరి విచారణ తేదీ త్వరలో వెల్లడికానుంది.

ఈ చట్టం భవిష్యత్తు ఏంటి? హైకోర్టు నిర్ణయంతో ఎలాంటి ప్రభావాలు ఉంటాయన్నది రాజకీయంగా, సామాజికంగా కీలకంగా మారనుంది. తాజా అప్‌డేట్స్ కోసం GarudaNetram.com ను ఫాలో అవ్వండి.

Leave a Comment