నందిగామ న్యూస్ / నిఘానేత్రం : నందిగామ పట్టణంలోని స్కానింగ్ సెంటర్లు nandigama scan blood centers మరియు రక్త పరీక్ష కేంద్రాలు అధిక ధరలతో సేవలు అందిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయి.
- రక్త పరీక్షల పేరిట నిలువు దోపిడీ
- పేట్రేగిపోతున్న ప్రైవేటు ల్యాబ్‌లు
- సామాన్యుడి జేబుకు చిల్లు
- పట్టించుకోని అధికారులు
నందిగామ పట్టణంలో స్కానింగ్, రక్త పరీక్షల పేరుతో సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నారు. అనవసరమైన భయాలు సృష్టించి గ్రామీణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. వైద్య ప్రమాణాలు పాటించకుండా, సరైన వైద్య పరికరాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ సెంటర్లలో వైద్య పరిక్షలు చేయించుకున్న వారు మరింత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనిపై అధికారులు తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నందిగామ న్యూస్ / నిఘానేత్రం : నందిగామ పట్టణంలోని స్కానింగ్ సెంటర్లు nandigama scan blood centers మరియు రక్త పరీక్ష కేంద్రాలు అధిక ధరలతో సేవలు అందిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయి. సాధారణంగా స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చినవారికి, రక్త పరీక్షలు చేయించుకునే వారికి అనవసరమైన భయాలు చూపిస్తూ అవసరం లేకున్నా అనేక పరిక్షలు చేసి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. దీంతో వేలకు వేలు రూపాయలు ఎక్కడి నుంచి తేవాలని సామాన్యులు బాహాటంగానే వాపోతున్నారు.
నిబంధనలు విస్మరించి వసూళ్లు
కొన్ని సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది సరైన అర్హతలు లేకుండా, నిర్దిష్ట వైద్య అనుమతులు పాటించకుండా ప్రజలకు వైద్య సేవల పేరుతో మోసం చేస్తున్నట్టు సమాచారం. సరైన అవగాహన లేని గ్రామీణ ప్రజలు అక్కడ ఉండాల్సిన సరైన ప్రామాణాలు తెలియక మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వైద్య ప్రమాణాలు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు.
విజయవాడ ఆస్పత్రులతో లింకులు?
చికిత్స కోసం వచ్చిన ప్రతి రోగికి ‘విజయవాడ’కు చెందిన కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్లాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం కోసమేనా? లేదా ఇంకా ఏదైనా ఉన్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఒక్కసారి ఆ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాలని కోరుతున్నారు.
ప్రజల భద్రత కోసం నిఘా అవసరం
ఈ సమస్యపై సంబంధిత వైద్య అధికారుల తనిఖీలు, నిబంధనల ప్రకారం కేంద్రాల ప్రమాణాలపై సమీక్ష అత్యంత అవసరం. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.
నిబంధనలు విస్మరించి వసూళ్లు
కొన్ని సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది సరైన అర్హతలు లేకుండా, నిర్దిష్ట వైద్య అనుమతులు పాటించకుండా ప్రజలకు వైద్య సేవల పేరుతో మోసం చేస్తున్నట్టు సమాచారం. సరైన అవగాహన లేని గ్రామీణ ప్రజలు ఆస్పత్రిలో ఉండాల్సిన ప్రామాణాలు తెలియక nandigama scan blood centers మరింత ప్రమాదాన్నికొని తెచ్చుకుంటున్నారు.