విధి ఒకటైనా, మానవతా విలువలు మరొకటి. ఈ రెండు ఒక్కటిగా కలిస్తే Vinukonda Police Station అందులో చూపించే ప్రేమ మరింత విలక్షణం. ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్.
ఈ స్టేషన్‌లో కానిస్టేబుల్ సావిత్రి గర్భవతిగా ఉండగా, మెటర్నిటీ లీవ్‌కి వెళ్లేముందు, స్టేషన్ సిబ్బంది ఆమెకు ఘనంగా శ్రీమంతం నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.
సావిత్రి – విధులకు అంకితమైన కానిస్టేబుల్
గత రెండు సంవత్సరాలుగా వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సావిత్రి, తన విధుల్లో నిబద్ధతతో వ్యవహరించేది. నాలుగేళ్ల క్రితం వివాహమైన ఆమె, ఇప్పటికే ఒక బాబుకి తల్లయింది. ప్రస్తుతం రెండోసారి గర్భం దాల్చిన ఆమె ఆరో నెల నడుస్తుండటంతో మెటర్నిటీ లీవ్‌కి సిద్ధమవుతోంది.
స్టేషన్ లో శ్రీమంతం – ఆడబిడ్డలా చూసుకున్న తోటి ఉద్యోగులు
ఈ సందర్భంగా మహిళా ఎస్‌ఐ స్వర్ణలత, షఫీ, సీఐ శోభన్ బాబు తదితరులు స్వయంగా సావిత్రిని తమ ఇంటి అమ్మాయిలా చూసుకొని, సంప్రదాయబద్ధంగా బట్టలు ఇచ్చి శ్రీమంతం నిర్వహించారు. పసుపు, కుంకుమ, అక్షింతలు, ఆశీర్వాదాలతో స్టేషన్ నిండిపోయింది.
కళ్లలో ఆనంద భాష్పాలు
తోటి సిబ్బంది చేసిన ఈ కార్యక్రమంతో సావిత్రి కళ్లలో ఆనందం కన్నీళ్లుగా మారాయి. ఈ సంఘటన పోలీస్ శాఖలో మానవీయతకి ప్రతీకగా నిలిచింది. Vinukonda Police Station తోటి ఉద్యోగులు తోబుట్టువులా ప్రేమను చాటుకున్నారు. అందుకు ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది.