ఎముక‌ల్లో బ‌లం పెర‌గ‌డానికి కొత్త‌ ఇంజెక్షన్‌! : Nervous Weakness

Health news Telugu

ఎముక బలహీనతతో బాధపడుతున్న వారికీ శుభవార్త. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు Nervous Weakness అభివృద్ధి చేసిన హైడ్రోజెల్ ఇంజెక్షన్‌తో నాలుగు వారాల్లోనే బలమైన ఎముకలు త‌యారుఅవుతాయి.

మహిళల్లో మూడుపదుల వయస్సు తర్వాత ఎముక బలం క్రమంగా తగ్గిపోతుంది. మెనోపాజ్‌ దశ ప్రారంభమైన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. 50 ఏళ్లకు పైబడి ఉన్న మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆస్టియోపొరోసిస్‌ కారణంగా ప్రతి ఏటా ఒక్కసారైనా ఎముకలు విరిగి ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆస్టియోపొరోసిస్‌ పెరిగిపోతే, తక్కువ ఒత్తిడికే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉండటంతో మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

ఇప్పటి వరకు దీనికి అందుబాటులో ఉన్న మందులతో కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ సమస్య కేవలం మహిళలకే కాకుండా మగవారిలోనూ కనిపిస్తోంది.

సరికొత్త పరిష్కారం.. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కృషి

ఈ సమస్యకు పరిష్కారంగా స్విట్జర్లాండ్‌లోని ల్యాబొరేటరీ ఆఫ్ బయోమెకానికల్ ఆర్థోపెడిక్స్ సంస్థ ఒక వినూత్న పద్ధతిని అభివృద్ధి చేసింది. హైడ్రోజెల్ ఇంజెక్షన్ ద్వారా బలహీనమైన ఎముకలను మళ్లీ బలపరచే విధానాన్ని అందించింది.

హైడ్రోజెల్ ఇంజెక్షన్ లో హెలురోనిక్ యాసిడ్, హైడ్రాక్సీయెపటైట్ వంటి పదార్థాలు ఉండటంతో, ఇది ఎముకల నిర్మాణ పదార్థాన్ని పోలి ఉంటుంది. బలహీనమైన ఎముక భాగంలోకి ఈ ఇంజెక్షన్‌ను వేస్తే, నాలుగు నుంచి ఐదు వారాల్లో ఆ ఎముక సాంద్రత పెరిగి ఐదురెట్లు బలపడుతుంది.

ఈ విధానం వల్ల ఎముకలు విరిగే ప్రమాదం తగ్గిపోతుంది. పూర్తిగా ఆస్టియోపొరోసిస్ నివారణ సాధ్యంకాదని దీని ద్వారా సమస్యను నియంత్రించవచ్చు, Nervous Weakness జీవన నాణ్యత మెరుగుపరచవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment