new ration card : ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ

ఏపీ కొత్త రేషన్ కార్డు జాబితా 2025 - మీ పేరు చెక్ చేసుకోండి

ఇక ఏటీఎం సైజులో రేష‌న్ కార్డులు
క్యూఆర్ కోడ్‌తో భ్ర‌ద‌త మ‌రింత పెంపు
విలేక‌రుల స‌మావేశంలో తెలిపిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌
త్వ‌ర‌లోనే కార్డులు మంజూరు చేస్తామ‌ని వెల్ల‌డి
సీఎం చంద్ర‌బాబు ఆవిష్క‌రిస్తార‌ని తెలిపిన మంత్రి

గ‌రుడ‌నేత్రం న్యూస్ : ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌ని ప్ర‌య‌త్నం కూట‌మి ప్ర‌భుత్వం చేసింది. రేష‌న్‌కార్డు అంటే ఇంత‌కు ముందు చాలా పెద్ద‌గా ఉండేది. వివ‌రాలు కూడా స‌రిగా క‌నిపించేవి కావు. వ‌ర్షంలో త‌డిస్తే పాడ‌యిపోతుంద‌ని ఆందోళ‌న ఉండేది. చిరిగిపోతుంద‌ని భ‌యం ఉండేది. ఎవ‌రైనా న‌లిపినా లేదా చింపినా లేదా లామినేష‌న్ చేసిన ఎన్నో ఇబ్బందులు ఉండేవి. అయితే నేటి కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం కొత్త ఆలోచ‌న చేసింది. ఇక ఏటీఎం కార్డు చిరిగిపోదు. న‌లిగిపోదు, పాడైపోదు ఎందుకంటే ఈ కార్డు చాలా స్మార్డు గురూ.. ఏటీఎం కార్డుని చూశారు క‌దా.. అచ్చం అలాగే రేష‌న్ కార్డుని new ration card రూపొందించారు.
వివ‌రాలు తెలిపిన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌
ఏపీలో కొత్త రేష‌న్ కార్డును ప‌రిచ‌యం చేసిన పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోమ‌ర్‌. ఇప్ప‌టి వ‌ర‌కు రేష‌న్ కార్డు అంటే చాలా పెద్ద సైజులో ఉండేది. కానీ ఇప్ప‌టి నుంచి రేష‌న్ కార్డు సైజు మార‌పోతుంది. కొత్త రేష‌న్ కార్డును ఏటీఎం సైజులో తీసుకువ‌చ్చారు. దీనికి ప్రెస్‌మీట్లో చూపించి ఆ కార్డు గురించి వివ‌రాలు తెలిపారు.
విలేక‌రుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ప్ర‌య‌త్నం ఎవ‌రూ చేయ‌లేద‌ని అన్నారు. అన్ని భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించి ఈ కార్డును తీసుకురావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. అయితే ఈ కార్డ‌లో కుటుంబ స‌భ్య‌ల వివ‌రాలు ఉంటాయ‌ని గ‌తంలో చూసుకుంటే కుంటుంబ వివ‌రాలు స‌రిగా ఉండేవి కాద‌ని అన్నారు. ఈ కార్డ‌లో స్ప‌ష్టంగా అన్ని వివ‌రాల‌తో స‌మాచారం ఉంటుంద‌ని తెలిపారు. కార్డు వెన‌క భాగంలో కుటుంబ స‌భ్యుల వివ‌రాలు ఉంటాయ‌ని అన్నారు. ఈ కార్డ‌లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే సీఎం చంద్ర‌బాబు గారితో క‌లిసి ఈ కార్డును new ration card ప‌రిచ‌యం చేస్తామ‌ని అప్పుడు అన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని పెర్కొన్నారు.

nadendla manohar
nadendla manohar

Leave a Comment