ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా జీవితం అసంభవంగా మారింది. (mobile effect) తినేటప్పుడు, నిద్రపోయే ముందు, నిద్రలేచిన వెంటనే ఫోన్ (Phone) చూడడం సహజమైపోయింది. కానీ, ఎక్కువమంది టాయిలెట్‌కి వెళ్లేప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే, ఇది ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరం. ఈ వ్యాసంలో టాయిలెట్లో మొబైల్ (Mobile) వాడకానికి సంబంధించిన ముప్పులు, దుష్పరిణామాలు మరియు వాటికి పరిష్కారాల గురించి వివరంగా చర్చిస్తాం.
టాయిలెట్లో ఫోన్ వాడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
పైల్స్ (Phills) (హెమరాయిడ్స్) సమస్య
టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల మలద్వారం (అనస్) చుట్టూ ఉన్న రక్తనాళాలపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వలన పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
మలబద్దకం మరియు జీర్ణ సమస్యలు
ఫోన్ చూసుకుంటూ, ఎక్కువసేపు టాయిలెట్లో గడపడం వల్ల మల విసర్జన ఆలస్యం అవుతుంది.
దీని వలన మలబద్దకం ఏర్పడి, దీర్ఘకాలిక జీర్ణ సమస్యలకు దారితీయొచ్చు.
శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం
ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు.
దీనివల్ల కాళ్ల నొప్పి, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది
వెన్నునొప్పి (Back Pain) మరియు మెడ నొప్పి
టాయిలెట్లో ఫోన్ చూస్తూ ముందుకు వంగి కూర్చోవడం వల్ల మెడ, వెన్నెముకకు ఒత్తిడి పడుతుంది. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఈ అలవాటు వెన్నునొప్పి, మెడ నొప్పి, స్పైన్ సమస్యలకు దారితీస్తుంది.
టాయిలెట్లో (Toilet ) ఫోన్ వాడటం వల్ల వచ్చే హైజీన్ సమస్యలు
టాయిలెట్ అనేది బాక్టీరియా మరియు వైరస్ ల పెరుగుదలకు సహాయపడే ప్రదేశం.
ఫోన్‌తో టాయిలెట్‌కు వెళ్లడం వల్ల ఎకోలి (E.Coli), సాల్మొనెల్లా (Salmonella) వంటి హానికరమైన బ్యాక్టీరియా మీ ఫోన్‌పై చేరి, ఆ తర్వాత శరీరంలోకి ప్రవేశించవచ్చు. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, ఇతర లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
టాయిలెట్లో ఫోన్ వాడకూడదని వైద్యులు ఎందుకు సూచిస్తున్నారు?
ముంబయిలోని లీలావతి హాస్పిటల్లో జనరల్ సర్జన్ డాక్టర్ నరేంద్ర నికమ్మా మాట్లాడుతూ టాయిలెట్లో 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు. శరీరంలోని పెల్విక్ కండరాలపై ఒత్తిడి పడకుండా ఉండటానికి ఈ అలవాటు మార్చుకోవాలి. దీనికోసం రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి అని సూచించారు.
టాయిలెట్లో ఫోన్ వాడకూడదని మానుకోవడానికి చిట్కాలు
టాయిలెట్లో ఫోన్ ఉపయోగించకూడదని స్వీయ నియంత్రణ పాటించండి.
ఫోన్ ఫ్రీ జో న్అనే నియమాన్ని ఇంట్లో అమలు చేయండి.
టాయిలెట్‌కి వెళ్లే ముందు ఫోన్‌ను బయట ఉంచండి.
ప్రింటెడ్ మేగజైన్ లేదా బుక్ చదవడం వంటి ప్రత్యామ్నాయాలను ప్రయత్నించండి.
ఆరోగ్యపరమైన అలవాట్లను అభివృద్ధి చేసుకోవడానికి, యోగా, వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి.
తీరని అలవాటు అయితే?
మీరు ఎంత ప్రయత్నించినా టాయిలెట్లో ఫోన్ వాడే అలవాటు మానలేకపోతే, ఇది మొబైల్ ఫోన్ డిపెండెన్సీ కు సంకేతంగా పరిగణించాలి. దీనికోసం డిజిటల్ డిటాక్స్ ప్రయత్నించండి. టాయిలెట్లో మొబైల్ ఫోన్ వాడటం అనారోగ్యానికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. MobileFreeZone పైల్స్, జీర్ణ సమస్యలు, వెన్నునొప్పి, హైజీన్ సమస్యలు వంటి అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ అలవాటును వీలైనంత త్వరగా మానుకోవడం మంచిది. మీరు టాయిలెట్లో ఫోన్ వాడుతున్నారా? అయితే, ఇప్పుడే ఆపేయండి!